ఈనెల 30న ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ ప్రారంభం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హుస్నాబాద్

కరీంనగర్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్, పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని, భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.