మహారాష్ట్రలో సింహస్థ కుంభమేళా ఏర్పాట్లు: రూ.35 వేల కోట్లతో అభివృద్ధి

రిపోర్టర్: రాజేష్ స్థలం: Nashik

మహారాష్ట్రలో నిర్వహించనున్న సింహస్థ కుంభమేళా ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను వేగవంతం చేశామని, వచ్చే ఏడాది ఆగస్టులో కుంభమేళా జరగనుందని ఆయన పేర్కొన్నారు. మరో పది పదకొండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పనులను మరింత వేగంగా పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా ముందుకు తీసుకువెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు.