ఓటీటీలోకి వరం డాటరాఫ్ భార్గవి: నవంబర్ 1 నుంచి స్ట్రీమింగ్
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ 'కథా సుధా' శీర్షికలో భాగంగా 'వరం డాటరాఫ్ భార్గవి' చిత్ర స్ట్రీమింగ్ తేదీని ప్రకటించినట్లు ఈటీవీ విన్ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ ఫ్యామిలీ డ్రామా డిజిటల్ వేదికగా అందుబాటులోకి రానుంది. తల్లి కూతుళ్ల అనుబంధం, నిజాయితీ నేపథ్యంలో సాగే ఈ లఘు చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.