ఫారెస్ట్ భూముల వివాదం: జన్నారంలో మాదిగల ఇళ్ల కూల్చివేతపై మూడో రోజు ధర్నా

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురుమడుగు గ్రామంలో మాదిగల భూములు మరియు ఇళ్లను కూల్చివేస్తున్న ఫారెస్ట్ సిబ్బంది చర్యలను తక్షణమే విరమించుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కూల్చివేతలపై మూడో రోజు కొనసాగిన ధర్నా కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి కొండుకూరి ప్రభుదాస్ మాదిగ, మండల అధ్యక్షులు గోనే ప్రభాకర్ మాదిగ పాల్గొని బాధితులకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ వ్యవహారాన్ని మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.