నమ్మిన వాళ్లను ఎప్పటికీ వదిలిపెట్టను నారా లోకేష్ స్పష్టం

రిపోర్టర్: సురేష్ స్థలం: Andhra Pradesh

ఒక్కసారి నమ్మి తన వెంట నడిచిన వాళ్లను ఎప్పటికీ వదిలిపెట్టనని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పాదయాత్ర సమయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా తన వెంటే నడిచి భరోసాగా నిలిచిన ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత తనదేనని ఆయన భరోసా ఇచ్చారు.