ఉప్పల్ వేదికగా ఘనంగా రావణ దహనం: కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Uppal
దసరా పండుగ సందర్భంగా ఉప్పల్ లో పెద్ద ఎత్తున జరిగిన రావణ దహన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు పాల్గొన్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ అధికారికంగా ట్వీట్ చేసింది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ బాధ్యులు పరమేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు వజ్రేశ్ యాదవ్, మాజీ కార్పోరేటర్ రజితతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేసినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు.