ఎల్లమ్మ సినిమా విడుదల తేదీ ప్రకటన: మార్చి 5న గ్రాండ్ రిలీజ్
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఎల్లమ్మ అని నిర్మాతలు వెల్లడించారు. బలగం వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ పర్షి పాత్రలో కనిపించనుండగా, స్పిరిట్ సినిమా వాయిదా పడటంతో ఈ సోలో రిలీజ్ డేట్ను చిత్రబృందం ఖరారు చేసింది.