పరిశుభ్రతకు పీఠం వేస్తూ కళాశాల బాగుకు మున్సిపల్ చైర్మన్ శ్రద్ధ
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కళాశాల యాజమాన్యంతో కలిసి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. మరో రెండు రోజుల్లో కళాశాలకు అవసరమైన బోర్డులు, డస్ట్బిన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుజాత, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.