పోషకాహారంతో విద్యార్థుల్లో పెరుగుతున్న చదువుపై ఏకాగ్రత
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందుతోందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు విద్యార్థులకు బెంచీలు, కుర్చీలు అందజేశారని చైర్మన్ పాలకుర్తి సారంగపాణి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేకు విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.