జర్నలిస్టుల హక్కుల సాధనే ధ్యేయంగా మహాసభల విజయవంతానికి పిలుపు
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా, విజయనగరం పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈనెల 20న జరిగే ఏపీయూడబ్ల్యూజే 27వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని డిప్యూటీ జనరల్ సెక్రటరీ శివప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల కోసం యూనియన్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర మహాపాత్రో మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం అందరం సమన్వయంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.