దక్షిణాఫ్రికాలో ఘోర కాల్పులు గర్భిణితో సహా పదకొండు మంది మృతి

రిపోర్టర్: రమేష్ స్థలం: World

దక్షిణాఫ్రికాలోని డర్బన్ టౌన్‌షిప్‌లో సాయుధులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో గర్భిణితో సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. క్వాజులు-నటాల్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు బాధితులను ఒక గదిలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సామూహిక కాల్పులకు వ్యక్తిగత విభేదాలు కారణమా లేక ఇతర నేర కార్యకలాపాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.