ఎన్నికల బరి నుంచి తప్పుకున్న వైకాపా ఎంపీటీసి అభ్యర్థి హిమబిందు
రిపోర్టర్: కిరణ్
స్థలం: కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు రెండు సెగ్మెంట్ వైకాపా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిమబిందు అనారోగ్య కారణాల వల్ల ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు. కొన్నేళ్లుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నానని, ప్రచార సమయంలో మరోసారి గుండెనొప్పి రావడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరుతున్నానని ఆమె తెలిపారు. పార్టీ నాయకులు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ పోటీ నుంచి వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు.