పండుగ వేళ విమాన ప్రయాణికులకు భారీ షాక్: విపరీతంగా పెరిగిన టికెట్ ధరలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: New Delhi
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీపావళి, ఛత్ పూజల వేళ ప్రయాణికులపై విమాన టికెట్ల ధరల భారం విపరీతంగా పెరిగిందని డిజిసిఏ అధికారులు వెల్లడించారు. ఇంధన ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం కారణంగా విమాన సర్వీసులు భారీ నష్టాలను చవిచూస్తున్నాయని తెలిపారు. ముంబై నుంచి పాట్నాకు విమాన టికెట్ ధర దుబాయ్ ప్రయాణం కంటే రెట్టింపు అయిందని ట్రేవెల్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.