రామాయణం సినిమాలో జటాయువు పాత్రకు వాయిస్ ఓవర్ ఇస్తున్న అనుపమ్ ఖేర్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో జటాయువు పాత్రకు ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ వాయిస్ ఓవర్ అందిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నవంబర్ ఐదున థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుందని, వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.