హైదరాబాద్ లో దారుణం: ఎయిర్ హోస్టెస్ శిక్షణార్థులైన మైనర్ బాలికలపై లైంగిక దాడి

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగుచూసిందని పోలీసులు తెలిపారు. ఎయిర్ హోస్టెస్ శిక్షణ పొందుతున్న ఇద్దరు మైనర్ బాలికలను నమ్మించి రూముకు తీసుకెళ్లిన గణేశ్, తరుణ్ అనే ఇద్దరు యువకులు బలవంతంగా మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మధురానగర్ పోలీసులు వెల్లడించారు.