పాకిస్థాన్ విభజన కుట్ర: నాలుగు ప్రావిన్సులను ముక్కలు చేయాలని ఆర్మీ చీఫ్ యోచన
రిపోర్టర్: మహేష్
స్థలం: Islamabad
పాకిస్థాన్‌ను రాజకీయంగా మరింత నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కుట్ర పన్నుతున్నారని నిపుణులు పేర్కొన్నారు. దేశంలోని నాలుగు ప్రధాన ప్రావిన్సులను పన్నెండు నుంచి పదిహేను చిన్న ప్రాంతాలుగా విభజించే ప్రతిపాదనను ఆయన తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలైతే రాజకీయ శక్తులు బలహీనపడి సైనిక ఆధిపత్యం మరింత పెరుగుతుందని, తద్వారా దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.