హైదరాబాద్ లో బీజేపీ మహా పాదయాత్ర: ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అమిత్ షా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
నవంబర్ రెండో తేదీన హైదరాబాద్ లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహా పాదయాత్రలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు నిజాం కాలేజ్ ఎదురుగా ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభ ద్వారా రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది.