ఐఓఏ ప్రత్యేక సాధారణ సమావేశం నేడు, సవరించిన రాజ్యాంగం ఆమోదం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
జాతీయ క్రీడా పాలనా చట్టం-2025కు అనుగుణంగా సవరించిన రాజ్యాంగాన్ని ఆమోదించేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రత్యేక సాధారణ సమావేశాన్ని మంగళవారం నిర్వహించనుంది. పి.టి. ఉష నేతృత్వంలోని కార్యవర్గ పదవీకాలం ముగియనుండటంతో జరగనున్న ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు ఈ రాజ్యాంగ సవరణ కీలకం కానుంది.