కామాఖ్య రైల్వే స్టేషన్లో మహిళను వేధించిన యువకుడు

రిపోర్టర్: గోపి స్థలం: Guwahati

అస్సాం రాష్ట్రంలోని కామాఖ్య రైల్వే స్టేషన్లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గుంగున్ దత్తా అనే మహిళ తన బంధువులను రైలు ఎక్కించేందుకు స్టేషన్కు వెళ్లగా, ఓ వ్యక్తి తనను అనుసరిస్తూ అసభ్య సైగలు చేశాడని బాధితురాలు తెలిపారు. ఈ వేధింపులపై ఆమె సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేయడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అస్సాం పోలీసులను కోరుతున్నారు.