ఆదిలాబాద్ బెటాలియన్‌లో కారుతో ఢీ కొట్టి ఆర్ఎస్ఐపై దాడి
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా యాపల్‌గూడ తెలంగాణ పోలీస్ బెటాలియన్ వద్ద గురువారం జరిగిన కారు ప్రమాదం కలకలం రేపింది. ఆర్‌ఎస్‌ఐ రాసం రాకేష్ మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ఆర్‌ఐ నరేష్ కారుతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రాకేష్, నిధుల దుర్వినియోగంపై గతంలో తాను ఇచ్చిన ఫిర్యాదుల కారణంగానే ఉద్దేశపూర్వకంగా ఈ దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు.