పంజాబ్లో దారుణం: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఏఎస్ఐ కాల్చివేత

రిపోర్టర్: కిరణ్ స్థలం: Tarn Taran

పంజాబ్లోని తరణ్తారణ్ జిల్లాలో కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఇక్బాల్ సింగ్ హత్యకు గురైనట్లు ఎస్ఎస్పీ సురేంద్ర లాంబా వెల్లడించారు. ఆదివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా బైక్పై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యపై గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉందన్న కోణంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.