అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి ప్రత్యేక ఏఐ ఫోర్స్ ఏర్పాటు
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమెరికా
అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏఐ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు త్వరలోనే ఏఐ జార్‌ను నియమించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనాతో సాంకేతిక పోటీలో అమెరికా ఆధిక్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన ఆయన, ఏఐ అభివృద్ధిని అడ్డుకునే చర్యలకు తాను మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేస్తూ పరిశ్రమను ప్రోత్సహిస్తామని వెల్లడించారు.