హైదరాబాద్‌లో చిల్లర వివాదం ఆటో డ్రైవర్ హత్యకు దారితీసిన వైనం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో చిల్లర డబ్బుల వివాదం ఆటో డ్రైవర్ ముఖరం హత్యకు దారితీసింది. మైలార్‌దేవ్‌పల్లి నుంచి వట్టేపల్లికి వెళ్లే క్రమంలో ఆటో కిరాయి చిల్లర విషయంలో చెలరేగిన గొడవతో, యూట్యూబర్ అజీమ్ తన స్నేహితులతో కలిసి ఆటో డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ తీవ్ర దాడిలో డ్రైవర్ ముఖరం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.