అమెరికాలో హెచ్ వన్ బీ వీసా రద్దుపై తీవ్ర ఆందోళన
రిపోర్టర్: సునీల్
స్థలం: Washington
అమెరికా ఐటీ రంగానికి వెన్నెముకగా నిలిచిన హెచ్ వన్ బీ వీసా కార్యక్రమాన్ని ఏడాదిలోగా నిలిపివేసే అవకాశం ఉందని యూఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డెస్పసీటో తెలిపారు. వీసా ప్రాసెసింగ్లో జరుగుతున్న భారీ మోసాలు, అక్రమాలపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయ టెక్కీల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.