'లంచం ఇస్తేనే పన్ను మదింపు చేస్తున్నారు': విజయనగరం నగరపాలక సంస్థలో అవినీతి కలకలం

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయనగరం

విజయనగరం నగరపాలక సంస్థలో ఆస్తిపన్ను విధింపు విషయంలో రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వీఎల్టీని చెక్కుల రూపంలో తీసుకొని వేరే పన్నులకు సర్దుబాటు చేస్తూ, లంచాలు ఇస్తేనే నగరంలో పన్ను మదింపు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొండి బకాయిదారులతో కుమ్మకై వసూళ్లు చేయకపోవడంతో నగరపాలిక ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఈ వ్యవహారంపై కమిషనరు బి.బాలస్వామి స్పందిస్తూ సిబ్బందిపై ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.