అల్లూరి జిల్లాలో వాగు దాటుతున్న సమయంలో బాలికను భుజాలపై మోసుకెళ్లిన వ్యక్తి
రిపోర్టర్: రమేష్
స్థలం: అల్లూరి జిల్లా
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అల్లూరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనంతగిరి మండలం లొంగపర్తి పంచాయతీ ఓనుకొండ గ్రామంలో ఓ వ్యక్తి బాలికను భుజాలపై మోసుకుని ప్రమాదకరంగా వాగు దాటిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వాగు దాటేందుకు వంతెన నిర్మించకపోవడంతో ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కూటమి ప్రభుత్వం స్పందించి శాశ్వత వంతెన నిర్మించాలని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.