విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలన్న మంత్రి నారా లోకేష్

రిపోర్టర్: సురేష్ స్థలం: కాకినాడ

కాకినాడలో చాగంటి కోటేశ్వరరావు గోశాల ప్రాంగణంలో విద్యార్థులతో జరిగిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని, క్లాస్ రూమ్ నుంచే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయని, విద్యార్థులు క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.