వల్లభనేని వంశీపై కూటమి కక్షసాధింపు చర్యలు: కొడాలి నాని

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఏపీ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు బనాయించిందని వైఎస్సార్‌సీపీ నేత కొడాలి నాని మండిపడ్డారు. రూ. పదివేల కోట్ల ఆస్తులున్న వంశీ గ్రావెల్ అమ్ముకున్నాడనడం హాస్యాస్పదమన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాల్లో స్పోర్ట్స్ కోటాను పెంచడంపై అనుమానాలున్నాయని, బ్యాక్ డోర్ నియామకాలకే ప్రభుత్వం ఈ మార్పులు చేసిందని తీవ్రంగా ఆరోపించారు.