ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత కబడ్డీ జట్టు

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణ పతకం సాధించడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్ పోరులో ఇరాన్ జట్టుపై 40-34 తేడాతో ఘన విజయం సాధించి దేశం గర్వపడేలా చేశారని ఆయన ప్రశంసించారు. ఆటగాళ్ళు కనబరిచిన అంకితభావం, పట్టుదల ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ అద్భుత విజయంతో క్రీడా రంగంలో భారత్ కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడించాయని ఆయన అభినందించారు.