హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మౌనిక సంతోషి అనుమానాస్పద మృతి

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని పోచారంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మౌనిక సంతోషి (28) గెలాక్సీ టవర్స్‌లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. యాక్సిస్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న మౌనిక, ఇన్ఫోసిస్ హెచ్ఆర్ రమాకాంత్ ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. భర్త వేధింపుల వల్లే మౌనిక చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.