ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి కర్నూలు రైతు భగీరథ ప్రయత్నం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కర్నూలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక 2.22 లక్షల హెక్టార్లలో పంటలు ఎండిపోతున్నాయి. పత్తికొండ మండలం దేవనబండకు చెందిన రైతు ప్రకాశ్‌ తన 15 ఎకరాల పొలంలోని పంటలను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు అడుగంటిపోవడంతో నెలకు లక్ష రూపాయల అద్దె చెల్లించి ట్యాంకరు తెప్పించి, ఆరు కిలోమీటర్ల దూరంలోని వాగు నుంచి నిత్యం నీరు తెచ్చి పంటకు తడులు అందిస్తున్నారు.