ఆరిమాని గంగమ్మ దసరా మహోత్సవం: ఆలయ పాలకమండలి ఆహ్వానం అందుకున్న ప్రేమయ్య నాయుడు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీరంగరాజపురం

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం తయ్యూరు పాయకట్టు వెలసిన ఆరిమాని గంగమ్మ దసరా మహోత్సవానికి కనికపురం ప్రేమయ్య నాయుడుని ఆలయ పాలకమండలి ఆహ్వానించింది. ఉత్సవాలకు తప్పనిసరిగా హాజరవుతానని ఆయన తెలిపారు. వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకట్ రాయల్, చైర్మన్ జలంధర్ నాయుడు, కమిటీ సభ్యులు చందు, సిద్దయ్య శెట్టి పాల్గొన్నారు.