టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా విజయాల వెనుక తల్లిదండ్రుల అంకితభావం

రిపోర్టర్: శివ స్థలం: Telangana

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి నయోమి ఒసాకా తన విజయాల ప్రయాణంలో తల్లిదండ్రులు చేసిన త్యాగాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటారని తెలిపారు. ఆమె తల్లి తామాకి ఒసాకా కుటుంబ భారాన్ని మోస్తూ ఆర్థికంగా అండగా నిలవగా, తండ్రిలియోార్డ్ ఫ్రాంకోయిస్ చిన్నతనం నుంచే టెన్నిస్ లో శిక్షణ ఇప్పించి క్రీడాకారిణిగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఇద్దరి కష్ట ఫలితంగానే తాను నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించగలిగానని నయోమి ఒసాకా స్పష్టం చేశారు.