తిరుమల బ్రహ్మోత్సవాలకు తితిదే విస్తృత ఏర్పాట్లు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తిరుపతి
తిరుమలలో ఈ నెల 15 నుంచి 23 వరకు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. సాధారణ భక్తులకు ప్రాధాన్యమిస్తూ అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు, శ్రీవాణి టికెట్లను రద్దు చేసింది. రోజుకు 80 వేల మందికి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. గరుడసేవ నాడు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ భద్రత, అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు.