కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణికుల ఆందోళన
రిపోర్టర్: నరేష్
స్థలం: కరీంనగర్
శ్రావణ మాసం చివరి మంగళవారం సందర్భంగా వేములవాడ, కొండగట్టు నుంచి తిరుగు ప్రయాణమైన భక్తులతో కరీంనగర్ బస్టాండ్ కిటకిటలాడింది. సరిపడ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వరంగల్ రూట్‌లో బస్సులు నిలిచిపోవడంతో ఆగ్రహించిన ప్రయాణికులు బస్టాండ్‌లో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రయాణికుల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. డిపో మేనేజర్ స్పందించి అదనపు బస్సులు కేటాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది.