మహిళా ఎమ్మెల్యేల అరెస్ట్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. నినాదాలు లేని దుస్తులు ధరించినా ఎందుకు అరెస్ట్ చేశారని, మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని మండిపడింది. ఎమ్మెల్యేలను అడ్డుకునే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని నిలదీస్తూ, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.