దివ్యాంగుల హక్కుల చట్టం అమలు చేయాలని యూజీసీ ఆదేశం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: India
దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను కచ్చితంగా అమలు చేయాలని యూజీసీ ఆదేశించింది. క్యాంప్స్‌లలో వసతులు మెరుగుపరచడంతో పాటు రిజర్వేషన్లు పాటించాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30, 2026 లోపు ప్రవేశాలు, నియామకాలు, నిధుల వివరాలను పోర్టల్‌లో సమర్పించాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.