పార్టీ నిధులు కాజేస్తే క్రిమినల్ కేసులు: బీజేపీ నేత అభయ్ పాటిల్ హెచ్చరిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

మున్సిపల్ ఎన్నికల సమయంలో అభ్యర్థులకు పంపించిన పార్టీ నిధులను కాజేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వెంటనే వెనక్కి ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బీజేపీ రాష్ట్ర సహ ఇన్చార్జి అభయ్ పాటిల్ హెచ్చరించారు. హైదరాబాద్లో సోమవారం పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆయన మాట్లాడుతూ, పదవులు తీసుకుని ఏసీ రూమ్లలో కూర్చుంటే సరిపోదని, క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని నాయకులకు స్పష్టం చేశారు.