పాలమూరు ప్రాజెక్ట్ మోటార్లపై రేవంత్ రెడ్డి సర్కార్ వైఖరిని నిలదీసిన హరీష్ రావు
రిపోర్టర్: అశోక్
స్థలం: సిద్దిపేట
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ పంప్‌హౌస్‌లో గల 145 మెగావాట్ల పంపులను ఇన్నాళ్లు ఆన్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ తీరు ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా కరువును తీర్చే మోటార్లను నిరుపయోగంగా మార్చడంపై బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తేనే ఈ ప్రభుత్వానికి సోయి వస్తోందని ఆయన ఆరోపించారు.