ఇసుకపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సర్వేపల్లి శాసనసభ్యుడు

రిపోర్టర్: సాయి దివ్య స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇసుకపాలెo ప్రాంతంలో చేపట్టిన రూ. 26 కోట్ల అభివృద్ధి పనుల్లో భారీ అక్రమాలు జరిగాయని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. మురుగు కాలువలు, డ్రైనేజీల నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. తప్పుడు లెక్కలతో కోట్లు కాజేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇందులో ఇసుక పాలెం సంబంధిత గ్రామస్తులుగా ఉన్నటువంటి వెంకటాచలం మండలం పిహెచ్సి వైద్యశాల చైర్మన్ శ్రీనీతా రెడ్డి,కిషోర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు హస్నాపురం శ్రీనివాసులు, కుంచా శ్రీనివాస్ యాదవ్, నరేష్, బాబు రెడ్డి, దార్ల నరేంద్ర,కూటమి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు