బరువు నిబంధన కారణంగా ఫైనల్స్ రేసు నుంచి తప్పుకున్న భారత అథ్లెట్ సుచిక

రిపోర్టర్: రాజేష్ స్థలం: Japan

జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ సుచిక తరియల్ సాంకేతిక కారణాలతో పతక పోరును కోల్పోయారు. సింగపూర్ అథ్లెట్ హుయ్ హూన్ టూన్‌తో జరిగిన 60 కేజీల ఎమ్మాఏ సెమీఫైనల్ పోరులో ఫలితం డ్రాగా ముగియగా, ఉదయం జరిగిన బరువు తూచే ప్రక్రియలో సుచిక 700 గ్రాములు అధికంగా ఉన్నట్లు తేలడంతో ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.