విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తున్నాం

రిపోర్టర్: సతీష్ స్థలం: విశాఖపట్నం

ఏపీలోని విశాఖపట్నంలో ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న 28,445 పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ సీఎం చంద్రబాబు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి శనివారం ఇళ్ల పట్టాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని, ఈ పట్టాల ద్వారా ప్రతి కుటుంబానికి విలువైన ఆస్తితో పాటు ఆత్మగౌరవం దక్కుతుందని సీఎం పేర్కొన్నారు.