జాతీయ స్థాయిలో నంబర్ వన్ బడ్జెట్ బడిగా విజయవాడ అభ్యాస పాఠశాల

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయవాడ

మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్న విజయవాడలోని అభ్యాస పాఠశాల దేశంలోనే నంబర్ వన్ బడ్జెట్ బడిగా నిలిచింది. సీఫోర్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ పాఠశాల 949 పాయింట్లు సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. బోధనా విధానం, మౌలిక సదుపాయాలు, ఖర్చుకు తగిన వసతుల వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డు ప్రకటించారు. దిల్లీలో ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే కార్యక్రమంలో యాజమాన్యానికి అవార్డు ప్రదానం చేయనున్నారు.