అమెరికా షరతులు నెరవేరే వరకు హుర్ముజ్ జలసంధి బంద్ అంటూ ఇరాన్ తేల్చిచెప్పింది
రిపోర్టర్: సురేష్
స్థలం: టెహ్రాన్
అమెరికా నేవీ దిగ్బంధం తొలగింపు సహా అన్ని షరతులు నెరవేరే వరకు హుర్ముజ్ జలసంధిని మూసి ఉంచుతామని ఇరాన్ సీనియర్ అధికారి స్పష్టం చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రాంతీయ ఘర్షణలు ఆగి, తమ డిమాండ్లు నెరవేరితేనే ఏడు రోజుల్లో జలసంధిని తెరుస్తామని తెలిపింది. మరోవైపు హుర్ముజ్ జలసంధిలో షిప్పింగ్ సేవలకు అంతరాయం కలగడం ఆమోదయోగ్యం కాదని ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థాని ఆందోళన వ్యక్తం చేశారు.