విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల ప్రచార రథం ప్రారంభం

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయనగరం

విజయనగరం కంటోన్మెంట్‌లో ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 26న అమ్మవారి తోలేళ్ల ఉత్సవం, అక్టోబర్ 27న సిరిమానోత్సవం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం అమ్మవారి ఉత్సవాల ప్రచార రథాన్ని ఎమ్మెల్యే విజయలక్ష్మి గజపతిరాజు ఘనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.