నకిలీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందిన నలుగురు విద్యార్థినులపై కేసులు

రిపోర్టర్: విజయ్ స్థలం: Uttarakhand

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నకిలీ స్వాతంత్ర్య సమరయోధుల డిపెండెంట్ సర్టిఫికెట్లను ఉపయోగించి ఎంబీబీఎస్ ప్రవేశాలు పొందిన నలుగురు విద్యార్థినులతో సహా ఐదుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణలో సర్టిఫికెట్లు నకిలీవని తేలడంతో అధికారులు వారి ప్రవేశాలను రద్దు చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కమిటీ ఈ మోసాన్ని వెలుగులోకి తెచ్చింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.