ఇంజినీరింగ్ విద్యార్థులకు తీపి కబురు: అమెజాన్ ఫ్యూచర్ స్కాలర్షిప్ ప్రకటన
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ఫౌండేషన్ ఫర్ ఎక్స్లెన్స్ సహకారంతో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ స్కాలర్షిప్ 2026-27 కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఆర్థిక లోటుతో విద్యార్థులు చదువును ఆపేయకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తెచ్చామని, అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థులు నవంబర్ ముప్పైవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.