ట్రిసల్ కాన్సెప్ట్పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన విజయవాడ పోలీసులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఎన్టీఆర్

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మైలవరం రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగాపురం గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మైలవరం సిఐ శ్రీ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ట్రిసల్ కాన్సెప్ట్పై తల్లిదండ్రులకు పలు కీలక విషయాలను వివరించారు. విద్యార్థుల భద్రత మరియు క్రమశిక్షణ కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు ముగ్గురూ సమన్వయంతో కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా Vijayawada City Police వెల్లడించారు.