టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోతలు, ఏఐదే హవా

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి నుంచి ఆగస్టు వరకు ప్రపంచవ్యాప్తంగా 289 టెక్ కంపెనీలు 1,23,305 మందిని తొలగించాయి. ఖర్చుల తగ్గింపు, పునర్వ్యవస్థీకరణతో పాటు కృత్రిమ మేధ వినియోగం ప్రధాన కారణమవుతోంది. సాధారణ నియామకాలు మందగిస్తుండగా, ఏఐ ఇంజినీరింగ్ నియామకాలు భారీగా పెరిగాయి. ప్రవేశ స్థాయి ఉద్యోగాల అవసరం తగ్గి, ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న మధ్యస్థాయి ఉద్యోగులకు గిరాకీ పెరుగుతోంది.