బెంగళూరులో ఘోర ప్రమాదం తప్పింది: సిలిండర్ లీకై నూనె దీపానికి అంటుకున్న మంటలు

రిపోర్టర్: హరి స్థలం: Bengaluru

బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఇంటి గుమ్మం వద్ద వెలిగించిన నూనె దీపం కారణంగా గ్యాస్ సిలిండర్ కు మంటలు అంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. గ్యాస్ డెలివరీ ఏజెంట్ భుజంపై మోసుకువచ్చిన సిలిండర్ స్వల్పంగా లీక్ కావడంతో దీపం మంటలు తగిలి క్షణాల్లోనే మంటలు చెలరేగాయని చెప్పారు. అప్రమత్తమైన డెలివరీ ఏజెంట్ తృటిలో ప్రాణాలతో బయటపడటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం తప్పిందని అధికారులు స్పష్టం చేశారు.